NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు దాతలు సహకరించండి..

1 min read

అయోధ్య తరువాత… తెలుగు రాష్ట్రాల్లో మొదటి విగ్రహం

  •  వస్తువు, నగదు రూపేణ ఇవ్వండి
  • విగ్రహ దాత, మాజీ సైనికుడు భాస్కర్​ రెడ్డి

కర్నూలు, న్యూస్​ నేడు : అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించిన రోజే…తమ గ్రామంలో కూడా రెండో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న సంకల్పంతో విగ్రహాన్ని రూపొందించామని, విగ్రహ ప్రతిష్టాపనకు దాతలు, ప్రజలు సహకరించాలని మాజీ సైనికుడు , రాముడి భక్తుడు , విగ్రహ దాత భాస్కర్​ రెడ్డి కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం, కొత్తపల్లి మండలం, జి. వీరాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించామని, ఆ గుడి ఆవరణలోనే బాల రాముడి విగ్రహంతోపాటు విఘ్నేశ్వరుడు, దక్షిణ మూర్తి, నవగ్రహాలు, నాగుల కట్ట విగ్రహాలు ప్రతిష్టాపనకు రూపొందుతున్నాయని, అంతేకాక  ధ్వజస్తంభం, గోపురం నిర్మాణంలో ఉన్నాయని, విగ్రహాల ప్రతిష్టాపనకు దాతలు వస్తువు, నగదు రూపేణ  సహకరించాలని ఈ సందర్భంగా భాస్కర్​ రెడ్డి కోరారు.  విగ్రహాల ప్రతిష్టాపనకు, అన్నదానం, హోమాలు తదితర కార్యక్రమాలకు ముందుకు వచ్చే దాతలు  ఫోన్​ నెం. 9640379363  ( ఫోన్​ పే, గుగుల్​ పే )ను సంప్రదించాలని మాజీ సైనికుడు భాస్కర్​ రెడ్డి విన్నవించారు.

About Author