NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూర్ లో  ఉపాధ్యాయులకు ఘన సన్మానం..

1 min read

మిడుతూరు , న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంఈఓ ఎస్.ఫైజున్నిసా బేగం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.కడుమూరు జిల్లా పరిషత్ ఎస్.ఉమాదేవి,కడుమూరు ఎంపీపీఎస్ ఆర్.కేశవ రాణి,49 బన్నూరు కె.సువర్ణ,తలముడిపిపి.మహాబున్నీసా,తిమ్మాపురం ఎస్.మాధవరావు, మిడుతూరు ఎంపీపీఎస్   కె.శివ నాగరత్నమ్మ, కడుమూరు కె.నాగవిజయ, చౌటుకూరు బి.రామ కృష్ణుడు, దేవనూరు ఎంఎస్.షకీరా బాను,చెరుకు చెర్ల పి.కుమారి బాయి,రోళ్లపాడు ఎస్.నసీ మున్నీసా,వీపనగండ్ల పి.నాగ రాజులను టీడీపీ మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, ఎంపీడీవో దశరథ రామయ్య, తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ తదితరులు ఘనంగా సన్మానించారు.తర్వాత వారి సేవలను కొనియాడారు. విద్యార్థులను క్రమశిక్షణతో పాటుగా విద్యలోనూ మంచి ప్రతిభ కనబరిచే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సాయి తిమ్మయ్య,టీడీపీ మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి,మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి,హెచ్ఎం సాయి తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author