మెరిసిన హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆణిముత్యం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : స్కూలోగేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో కర్నూలు జిల్లా అండర్-17 బాలికల కబడ్డీ జట్టుకు కెప్టెన్గా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, హోళగుంద విద్యార్థిని చలువాది భూమిక ఎంపికయ్యింది. ఈ సందర్భంను పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాద్యాయులు పి. కబీర్ సాబ్ మరియు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయు యూనస్ బాష అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాద్యాయులు పాల్గొన్నారు.అలాగే బాలల దినోత్సవంను పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన వివిధ రకాల ఆటలపోటీలలో గెలిచిన బాలబాలికలకు బహుమతులు, పతకాలు హెచ్.ఎం. కబీర్ సాబ్ చేతుల మీదుగా మరియు ఉపాద్యాయినీ, ఉపాద్యాయుల చేతుల మీదుగా విజేతలకు ప్రధానం చేయడం జరిగింది.


