పన్నుల వసూళ్లకు సంబంధించి బకాయిల వసూలుపై కఠినంగా వ్యవహరించాలి
1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో పన్నుల వసూళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలపై కఠినంగా వ్యవహరించి వాటిని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిఎస్టి అమలు చేయడంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్షన్ 51 ప్రకారం అన్ని ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు జిఎస్‌టి రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. అదే విధంగా వారు ప్రతి నెల 20వ తేదీ లోపు రిటర్న్స్ ఫైల్ చేయాలన్నారు. లావాదేవీలు లేకపోయినా ‘నిల్’ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ విభాగాల్లో (R&B, పంచాయతీ రాజ్ మొదలైనవి) జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటేనే టెండర్లు కేటాయించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జీఎస్టీ రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం నేరుగా వినియోగదారులకు అందుతుందో లేదో లీగల్ మెట్రాలజీ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ మాట్లాడుతూ పన్నుల వసూళ్ళు, బకాయిలు తదితర అంశాల గురించి వివరించారు సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

