NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనల కోసం ఒక గంట ముందస్తు వెసులుబాటు

1 min read

– సీఎం చంద్రబాబు కి, మైనారిటీ మంత్రి ఫరూక్ కి, ఆలూరు ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి కి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్

హోళగుంద న్యూస్ నేడు: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల నిమిత్తం సాయంత్రం పనివేళల ముగింపుకు ఒక గంట ముందుగానే వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎన్.ఎం.డి. ఫరూక్ తెలిపారు.ఈ వెసులుబాటు ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల సిబ్బంది సహా అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ముస్లిం ఉద్యోగులందరికీ వర్తిస్తుందని మంత్రి ఫరూక్  స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.అత్యవసర పరిస్థితులు మినహా, రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు తమ మతపరమైన ఆచారాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించుకునేలా ఈ మానవతా పరమైన నిర్ణయం తీసుకోవడం పట్లముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్ తెలిపారు. అలాగే మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి భావోద్వేగాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రభుత్వస్థాయిలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్.ఎం.డి. ఫరూక్ కి, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో నిరంతరం కృషి చేసిన ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రంజాన్ మాసంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మైనారిటీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ముల్లా మోయిన్ పేర్కొన్నారు.

About Author