లీ ఫార్మా అధ్వర్యంలో బాస్కర్ విద్యానికేతన్ లో ఉచిత వైద్య శిబిరం
1 min read
ఎముకల దృఢత్వానికి నాణ్యమైన ఆహారం తీసుకోవాలి
లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి
గాజువాక,విశాఖపట్నం న్యూస్ నేడు: నేటి అధునిక ప్రపంచంలో ఆహారం తీసుకోవడంలో చాల మంది శ్రద్ద వహించడం లేదని,మనిషి జీవన విధానంలో నాణ్యమైన,ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలని,త ద్వారానే మనిషి ఆరోగ్యంగా ఉంటాడాని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి పేర్కోన్నారు. ఉచిత ఎముకలు మరియు కీళ్ల ఆరోగ్య వైద్య శిబిరంలీ ఫార్మా లిమిటెడ్ మరియు లీ హెల్త్ డొమైన్ సంయుక్తంగా విశాఖపట్నంలోని గజువాకలో ఉన్న భాస్కర్ విద్యానికేతన్ స్కూల్లో , శనివారం కౌమారదశలో ఉన్న విద్యార్థుల కోసం ఉచిత ఎముకలు మరియు కీళ్ల ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించాయి.ఈ శిబిరంలో సుమారు 150 మంది విద్యార్థులు హాజరైయ్యారు. వారికి ఈ వివిధ రకాలైన పరీక్షలు నిర్వహించి, నిపుణులైన వైద్యులు మరియు పోషకాహార నిపుణులచే సలహాలు అందించారు.ప్రదానంగాఎత్తు మరియు బరువు (Height & Weight)నడుము మరియు తుంటి కొలతలు (Waist & Hip Circumference)చేతి పట్టు బలం (Hand Grip Strength)పై చేయి చుట్టుకొలత (Mid Upper Arm Circumference)ట్రైసెప్స్ స్కిన్ఫోల్డ్ మందం (Triceps Skinfold Thickness)హిమోగ్లోబిన్ పరీక్ష (Haemoglobin Test), ఫ్లెమింగో బ్యాలెన్స్ టెస్ట్ మరియు ట్యాపింగ్ టెస్ట్ (Flamingo Balance & Tapping Test)డాక్టర్ మరియు న్యూట్రిషనిస్ట్ సంప్రదింపులు తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో , కోఆర్డినేటర్లు సరోజిని మరియు జయలక్ష్మి , డాక్టర్ రాధిక , పోషకాహార నిపుణులు మాధురి మరియు క్రాంతి, జి.ఎన్.ఎమ్ (GNM) భాగ్యలత మరియు లీ ఫార్మా లిమిటెడ్ ఉద్యోగులు పాల్గొన్నారు.వైద్యులు మరియు పోషకాహార నిపుణులు విద్యార్థుల నివేదికలను పరిశీలించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తగిన సూచనలు మరియు సలహాలు ఇచ్చారు.


