విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..
1 min read

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జూపాడుబంగ్లా అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి సత్యనారాయణ మూర్తి విద్యార్థులకు సూచించారు.నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు మంచి ఉన్నత స్థానంలో అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఒక లక్ష్యంతో మీరు ఉపాధ్యాయులు చెప్పిన విధంగా క్రమ శిక్షణతో మంచిగా చదవాలని అంతేకాకుండా తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల ప్రిన్సిపాల్ మరియు పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ జయన్న విద్యార్థులకు సూచించారు.తర్వాత విద్యార్థులకు బహుమతులను వారు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి,పీడీ విజయ భాస్కర్ రెడ్డి,అల్తాఫ్ హుస్సేన్, కృష్ణుడు,సుబ్బారెడ్డి, సోమశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

