రోళ్లపాడులో వృద్ధుడు ఆత్మహత్య..
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు :జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ అన్నారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని 10.బొల్లవరం గ్రామానికి చెందిన నాగేశ్వర రెడ్డి (79) అనే వృద్ధుడు మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామంలో ఉన్న భరక సంజీవరాయ స్వామి దేవాలయ సమీపంలో శనివారం తెల్లవారు జామున చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అదేవిధంగా వృద్ధాప్య జీవితంపై విరక్తి చెందడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఒసేయ్ తెలిపారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలకి ఎస్సై మరియు ఏఎస్ఐ సుబ్బయ్య చేరుకుని పరిశీలించారు.నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు మృతునికి భార్య నాగేశ్వరమ్మ ఉన్నారు.కొడుకు రామ్మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఓబులేష్ తెలిపారు.

