సొసైటీ ఎరువుల సరఫరా గోడౌన్ ఆకస్మిక తనిఖీ
1 min read

జిల్లాలో ఎరువులు కొరత లేదని,సరిపడా నిల్వలు ఉన్నాయి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఎవరైనా ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
అంతర్ జిల్లా,అంత రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కఠినమైన నిఘా ఏర్పాటు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు మండలం చాటపర్రు సొసైటీ ఎరువుల సరఫరా, గోడౌన్ ను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు.రిజిస్టర్లను,గోడౌన్ లో స్టాకును పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో సరిపడా ఎరువులు నిల్వలు ఉన్నాయని ఏటువంటి కొరత లేదని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు. ముఖ్యంగా యూరియా సరఫరాపై ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగిందని, రైతులకు నానో యూరియా మరియు నానో డిఏపి గురించి రైతులకు అవగాహన కల్పించి వారితో వినియోగించాలని తెలిపారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. యూరియాని అవసరం మేరకు దఫదఫాలుగా రైతులకు సరఫరా చేయటానికి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ రవాణాను నివారించుటకు అంతర జిల్లా మరియు అంతర రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.అక్రమంగా ఎరువులు నిల్వ ఉంచేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని, అంతేకాక ఎవరైనా డీలర్లు ఎరువులను బ్లాక్ మార్కెటింగు చేసినా అధిక ధరలకు అమ్మినా చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాష,ఫిషరీస్ డిడి బి. నరసయ్య, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఇ.అనిల్ కుమారి, తహశీల్దారు జి.విజయకుమార రాజు, మండల వ్యవసాయ శాఖ అధికారి డి వెంకటేశ్వర్లు, సొసైటీ ఉద్యోగులు,తదితరులు పాల్గొన్నారు.

