ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి!
1 min read

-జడ్జి జోష్ణ దేవి
న్యూస్ నేడు, పత్తికొండ: ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి జోష్ణ దేవి తెలిపారు. శనివారం పత్తికొండ పట్టణంలోని పాతపేట శ్రీ వాసవి కళ్యాణ మండపంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో కర్నూలు ఓమ్ని ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని జడ్జి జోష్ణ దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కర్నూలు ఓమ్ని ఆసుపత్రి డాక్టర్ జ్యోష్ణ, డాక్టర్ పరమేష్, సిబ్బంది పృద్వి, శశిధర్, ప్రజలు పాల్గొన్నారు.

