NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీటి కేటాయింపులో తీవ్రమైన అన్యాయం..

1 min read

ముచ్చుమర్రి,మల్యాల ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడు సందర్శన

మాజీ అదనపు డీజీపీ,రైతు సంఘాల నాయకులు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: రాయలసీమకు నీటి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందనిరాష్ట్ర అదనపు మాజీ డీజీపీ వెంకటేశ్వరరావు అన్నారు. రైతు సంఘం సీనియర్ నాయకులు బొజ్జా దశరథ రామిరెడ్డి,టి లక్ష్మీనారాయణ, రామ చంద్రయ్య తదితరులు ప్రాజెక్టులను పరిశీలించారు. మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ ప్రాంతంలోని చివరి ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందించాలని, ప్రజలకోసం ప్రాజెక్టులు నిర్మించి సాగు త్రాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. రాయల సీమ ప్రాంతంలోని ఆయా ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ టిఎంసీల నీరును తరలించి వాడుకుంటున్నారు. అని పదే పదే తెలంగాణ ప్రభుత్వం  చెప్పడం సరికాదని అది తప్పుఅని వారు ఖండించారు.రాయల సీమకు రావలసిన నీటివాటలో సగభాగం కూడా నీటిని వాడుకోవడం లేదని అందుకు సరిపడా కాలువల వెడల్పు గానీ పంట కాలువలు లేవని వారు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న  విమర్శలు ను రాష్ట్ర ప్రభుత్వం వింటూ ఎందుకు మౌనం వహిస్తుందో  ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం కోసం  అందరం కలిసి పాలక ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహించాలి అన్ని ప్రాజెక్టులు సందర్శించి భవిష్యత్ ఉధ్యమ కార్యాచరణ రూపొందిస్తామని నందికొట్కూరు నియోజకవర్గనికి చుట్టూ  కృష్ణా నది జలాలు తలమానికంగా వుండి ఇతర ప్రాంతాలకు నీరు  తరలిస్తున్నారని కానీ పట్టణ ప్రజలకు  త్రాగునీరు అందడం లేదని వారు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు,లెనిన్ బాబు,రఘురాం మూర్తి,రమేష్ బాబు,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author