మల్కాపురం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా రూరల్ ఎంపీడీవో బాధ్యతల స్వీకరణ
1 min read

బాబు జగజ్జీవన్ రామ్ కి నివాళులు అర్పించిన స్పెషల్ ఆఫీసర్ విష్ణు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఏలూరు రూరల్ మండల డిప్యూటీ ఎంపీడీవో చింతమనేని విష్ణు గారు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించిన ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు.మల్కాపురం సచివాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలుబాధ్యతలు స్వీకరించిన అనంతరం, దేశ మాజీ ఉపప్రధాని, భారతరత్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి స్పెషల్ ఆఫీసర్ చింతమనేని విష్ణు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి చింతమనేని విష్ణు మాట్లాడుతూ “బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, నిబద్ధతతో గ్రామ అభివృద్ధికి , పేదల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటంతో పాటు, పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని,పాలనలో పారదర్శకత, నిజాయితీతో మల్కాపురం అభివృద్ధికి గౌరవ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనీ ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సహకారంతో తన వంతు కృషి చేస్తాను అని తెలిపారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన చింతమనేని విష్ణుకు గ్రామ పెద్దలు,కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో తమ పూర్తి సహకారం అందిస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లుకలాపు సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు కొట్టే.సుబ్బారావు, క్లస్టర్ ఇంచార్జ్ నేతల రవి, రుంజల విజయ్, సహా పలువురు కూటమి నాయకులు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

