NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“రేమట గ్రామంలో” సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

1 min read

రేమట గ్రామం (కర్నూలు మండలం,) జూలై 20, 2025:

ప్రజా శ్రేయస్సే నా ధ్యేయం… అంటూ ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి

 కోడుమూరు ఎమ్మెల్యే  బొగ్గుల దస్తగిరి   ఈరోజు కర్నూలు మండలంలోని రేమట గ్రామంలో

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు మండలం టీడీపి సీనియర్ నాయకులు బి యు వెంకటేశ్వర్లు , రేమట గ్రామ సర్పంచ్ కె పెద్ద వెంకన్న  ఆధ్వర్యంలో నిర్వహించిన “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారిని  ఘన స్వాగతం పలుకుతూ బూతు నెం 128 లో స్థానిక టీడీపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి . ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమo గురించి అడిగి తెలుసుకున్నారు. దాంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు మాట్లాడుతూ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరియు డి విష్ణువర్ధన్ రెడ్డి  మరియు ఎమ్మెల్యే   చొరవతో మా గ్రామంలో ఎంతో అభివృద్ధి   చేశారని. మా అందరికీ పిల్లలకి తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ లు అందిందని ఎమ్మెల్యే తో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే  మాట ఫ్ర్్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం మరియు అన్నదాత సుఖీభవ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.స్థానికులు తమ గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముస్లిం సోదరులు స్మశాన వాటిక గురించి,అడగగా స్వయంగా స్మశాన వాటికను సందర్శించిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి    సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి ఇప్పిస్తామని  హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో. కర్నూల్ మండలం టిడిపి సీనియర్ నాయకులు బి.యు వెంకటేశ్వర్లు  రేమట గ్రామ సర్పంచ్ కె.పెద్ద వెంకన్న  మరియు ఉప సర్పంచ్ s. గోకారి , ఎం రాఘవ రెడ్డి  128 భూత్ ఇంచార్జి ఎం. రాజారావు మరియు యూనిట్ ఇంచార్జ్ ఏ.వేణుబాబు మరియు మైనార్టీ నాయకులు,స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, మరియు గ్రామ పెద్దలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author