NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్రప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోనికి నెట్టుతున్న ప్రభుత్వం       

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: యుద్ధం పేరుతో ప్రజలను ఆర్ధిక దోపిడీ చేస్తున్న ప్రభుత్వం….    పెంచిన పెట్రోల్ డీజీల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి…… బహుజన ముక్తి పార్టీ (BMP )..         కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని బహుజన ముక్తి పార్టీ దేశవ్యాప్తంగా నీరసన, ఆందోళన కు పిలుపులో బాగాంగా నేడు కర్నూలు నగరంలో బహుజన ముక్తిపార్టీ ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిబా ఫూలే సర్కిల్ నుండి పెరిగిన పెట్రోల్ డీజీల్ గ్యాస్ ధరలకు నిరసనగా ఎడ్ల బండి తో మరియు మోటారు సైకిల్ల నుఆటోలను తోసుకుంటూవెళ్లే ర్యాలీని ఓబీసీ మోర్చాజాతీయ నాయకులు డా!కంచెర్ల హరిప్రసాద్ గారు ప్రారంభిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నీలాదీస్తామ న్నారు.భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం సంక్షోభం లో ఉందన్నారు. విద్యా వైద్య రంగాల్లో పూర్తిగా విఫలమయిందని ఇది లీకేజీ ప్రభుత్వమని అన్నారు.కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.అనంతరం ర్యాలీని ఉద్దేశించి బహుజన ముక్తిపార్టీ జిల్లా కన్వీనర్ దాసరి రామశేషయ్య కో కన్వీనర్ ఎన్ కె జయన్న మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తప్పుడు ఆర్ధిక విధానాలతో దేశాన్ని ఆర్ధిక సంక్షోభం లోనికి నెట్టుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన 2014లో పెట్రోల్ రు 64 డీజిల్ రు 56 గ్యాస్, రు 440నేడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను 150%పెంచి పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరచింది. యుద్ధం పేరుతో పెట్రోల్ డీజీల్ గ్యాస్ ధరలను ఆమంతంగా పెంచి పెదప్రజల జీవితాలను ఛిద్రం చేసింది. యుద్ధం పేరుతో ఆర్ధిక దోపిడీకి పాలుపడే ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడలేదు. .ఒకవైపు పెట్రోల్ నిల్వలు ఉన్నాయంటూనే ధరలను పెంచటమంటే, ప్రజలను మోసాగించట మే అవుతుంది. పెట్రోల్ డీజిల్ పెరుగదలతో నిత్యావసర ధరలు విఫరీతంగాపెరిగి ప్రజల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని బహుజన ముక్తిపార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. నిరసన కార్యక్రమంలోబాంసెఫ్ నాయకులు పెరికల రంగస్వామి భారత్ ముక్తి మోర్చాజిల్లా నాయకులు యం.నాగరాజు.రవి భాస్కర్, యం రాజు రంగయ్య సుందర్ రాజు, సురేష్, మహేష్    పాల్గొన్నారు.         దాసరి రామశేషయ్య. జిల్లా కన్వీనర్.      ఎన్ కె జయన్న కో కన్వీనర్.    బహుజన ముక్తి పార్టీ… కర్నూలు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *