జాతర మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు చరిత్రకే తలమానికంగా నిలిచే స్థాయిలో జరిగిన పవర్ పేట,తూర్పువీధి, దక్షిణపు వీధి,ఆదివారపు పేట, లక్ష్మీవారపు పేటల జాతర మహోత్సవాల నిర్వహణ మరియు జాతర ఊరేగింపు కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన భక్తులకు,కమిటీ సభ్యులకు, పోలీసు అధికారులకు,ఇతర శాఖల అధికారులకు, సిబ్బందికి,పారిశుద్ధ్య ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులుతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నని తెలిపారు.

