NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“సుపరిపాలనకు శ్రీకారం – టీడీపీ ఇంటింటి ప్రజా సంకల్పం”

1 min read

సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్  మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి   ఆదేశాల మేరకు…

హొళగుంద, న్యూస్ నేడు :  హొళగుంద మండలం,హెబ్బటం గ్రామం నందు టీడీపీ యూనిట్ ఇంచార్జ్ బి. సవారప్ప, బూత్ ఇంచార్జ్ లు, మల్లికార్జున, గోపాల్, శేక్షవాలి, నాగయ్య,,మండల రైతు సంఘం సభ్యులు, శేఖర్, బీజేపీ కాళప్ప, మాణిక్య,లు ప్రతీ ఇంటికీ వెళ్లి చంద్రబాబు గారి నాయకత్వంలో నెలకొల్పిన సంక్షేమ పథకాలను,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పింఛన్లు,తల్లికి వందనం,దీపం పథకం,సీసీ రోడ్లు,యువతకు ఉపాధి, ప్రతి రంగంలో మార్పు ప్రజలకే కనిపిస్తోందనీ.ప్రజల ఆదరణ,ఆశీర్వాదాలే మాకు ప్రోత్సాహం,చిన్నచిన్న సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించామని,ప్రజలకు చేరువగా ఉండే ప్రయత్నం మున్ముందూ కొనసాగుతుందనీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వారితోపాటు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author