NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఇంటికీ అభివృద్ధి – ప్రతి గడపకూ భరోసా.!!

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు:  శుక్రవారం కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం ఈ. తాండ్రపాడు గ్రామంలో “సుపరిపాలనలో – తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే  బొగ్గుల దస్తగిరి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందిస్తూ, గ్రామస్తుల సమస్యలను నేరుగా స్వీకరించారు.ఉచిత గ్యాస్ సిలిండర్లతో మహిళల వంటింటి కష్టాలు తగ్గాయి. తల్లికి వందనం పథకం, పెరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ముఖాల్లో ఆనందం నింపాయి. గత పాలనలో లేని పారదర్శకత, నేడు ప్రజల ఇంటి వరకూ అందుతోంది.అని అలాగే.మంచి పాలన అంటే ఇదే. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితంగా పనిచేస్తూ, గడపగడపకు వెళ్లి నమ్మకాన్ని మరింత బలంగా మారుస్తున్నాం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజలు. గ్రామంలో ఉన్న నీటి సమస్య & కాలువలు మరియు రోడ్డు సమస్యలు ఎమ్మెల్యే  దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే  స్వతహాగా పరిశీలించి గత ఐదు ఏళ్ల పాలన వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలకు చెబుతూ మన ప్రభుత్వంలో ఈ సమస్యలన్నీ కచ్చితంగా తీరుస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కర్నూలు మండలం టిడిపి పార్టీ నాయకులు, గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు,  సచివాలయ సిబ్బంది మొదలగువారు పాల్గొన్నారు.

About Author