శ్రీ ఆత్కూరి మొల్లమాంబ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి
1 min read

ఏపి రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్
ప్యాపిలి న్యూస్ నేడు: అన్ని జిల్లా కేంద్రాలలో, నియోజకవర్గాల్లో మరియు మండల కేంద్రాలలో శ్రీ ఆత్కూరి మొల్లమాంబ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుందాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ ఆత్కూరి మొల్లమాంబ గారి జయంతి (13-03-2026)ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నీ జిల్లాల కలెక్టర్ లకు అధేశించ డమైనది.కాబట్టి రాష్ట్రం లోని కుమ్మరులు అందరు పెద్ద సంఖ్య లో పాల్గోని కుమ్మరుల ఐక్యతను చాటుతు మార్చి న రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో, నియోజకవర్గాల్లో మరియు మండల కేంద్రాలలో స్తానిక సంబందిత అధికారులను సమన్వయం చేసుకొని ఘనంగా “శ్రీ మొల్లమాంబ జయంతి” కార్యక్రమాన్ని చేయలని కోరుతూ,మట్టి మన సంస్కృతి. మట్టి మన జీవనం. ఆ మట్టిని కళగా మార్చి సమాజానికి అవసరమైన పాత్రలను అందించిన గొప్ప సంప్రదాయం కుమ్మరి వృత్తి. ఆ శ్రమలో, ఆ మట్టిలో మన పూర్వీకుల గౌరవం, సంస్కృతి, జీవనతత్వం దాగి ఉంది. అలాంటి గొప్ప సంప్రదాయం నుంచి వెలుగొందిన మహా కవయిత్రి అతుకూరి మొల్లమాంబ గారు. తెలుగు సాహిత్యానికి అపారమైన సేవ చేశారు. సాధారణ కుమ్మరి కుటుంబంలో జన్మించి కేవలం దైవ చింతనతో జ్ఞానాన్ని పొంది మొల్ల రామాయణం ను తెలుగులో రచించి రామాయణాన్ని ప్రజలకు మరింత దగ్గర చేశారు. ఆమె ప్రతిభ మన సమాజానికి గర్వకారణం…అలంటి గొప్పవారి జయంతిని మనం జరుపుకోవడం మనజాతికి మనకు గర్వకారణం ఆయన తెలిపారు.

