సిఐటియు అధ్వర్యంలో సంతకాల సేకరణ
1 min read

సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు S.A. చిన్న రహి మాన్
ప్యాపిలి న్యూస్ నేడు: ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అన్ని అమలు చేయాలని కోరుతూ సంతకాల సేకరణకు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు షేక్. హుస్సేన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్.ఎ. చిన్న రహిమాన్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్ ప్రారంభించాలని గత రెండు సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని దశలవారీగా రెండు సంవత్సరాలు సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం కారణంగా కూటమి ప్రభుత్వం దిగివచ్చి సంక్షేమ పథకాలను పునర్ ప్రారంభిస్తామని చెప్పి ప్రసవ కానుక 20,000 వివాహ కానుక 40 వేలు సాధారణ మరణానికి 60000 మట్టి ఖర్చులకు 20,000 అంటూ నాలుగు పథకాలను ప్రకటిస్తూ మార్చి ఒకటో తేదీ నుండి అమలులోకి వస్తుందని జీవోను రిలీజ్ చేసింది ఈ జీవోలో గతంలో సంక్షేమ పథకాలు అమలైన విధంగా అమలు చేయకుండా కొన్నింటిని మాత్రమే ప్రకటించడం చాలా అన్యాయం అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల సహాయ దర్శి పద్మశాలి. శ్రీనివాసులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వడ్డే శ్రీనివాసులు ఆర్. మధు, రాసి పోగుల శివ ప్రతాప్, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

