తివాచీ పరిశ్రమకు ఏలూరు నగరం పెట్టింది పేరు
1 min read

తివాచీ పరిశ్రమకు ప్రోత్సాహం అందించి,అభివృద్ధికి సహకరించి ఆదుకోవాలి
ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ని కోరిన కార్పెట్ సంస్థ ప్రతినిధులు
సానుకూలంగా స్పందించిన ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు నగరానికి ప్రసిద్ధి చెందిన తివాచి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందించి తివాచి పరిశ్రమ అభివృద్ధికి ఆదుకోవాలని ఏలూరు కార్పెట్ సంస్థకు చెందిన ప్రతినిధులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ని కోరారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం పీ4 కార్యక్రమం అనంతరం విజయవాడ బయలుదేరుతున్న మంత్రి మనోహర్ ని ఏలూరు కార్పెట్ సంస్థకు చెందిన మహమ్మద్ ఇంతియాజ్ అహమ్మద్ తన సంస్థ ద్వారా నేసిన తివాచీలను మంత్రి మనోహర్ కి చూపించారు.తివాచి పరిశ్రమకు ఏలూరు నగరం పెట్టింది పేరని, ప్రస్తుతం తివాచి పరిశ్రమ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, ఏలూరులోని తివాచి పరిశ్రమకు పూర్వవైభవం వచ్చేలా తోడ్పాటు అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.ఈ విషయంపై మంత్రి మనోహర్ సానుకూలంగా స్పందిస్తూ పరిశీలిస్తానని ఇంతియాజ్ అహమ్మద్ కు తెలియజేసారు. జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్,సొంగా రోషన్ కుమార్,జాయింట్ కలెక్టర్ పి.దాత్రిరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుబ్రమణ్యేశ్వర రావు, ప్రభృతులు పాల్గొన్నారు.

