NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీసీల కోసం చేసిన 5 డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి..

1 min read

హోళగుంద న్యూస్ నేడు: బీసీల హక్కులకై చారిత్రక ఘట్టం – ఏప్రిల్ 11నుంచి బోడె రామచంద్ర యాదవ్ “బీసీ ధర్మ దీక్ష” పేరుతో ఆమరణ నిరాహారదీక్ష”బీసీ సింహగర్జన” డిమాండ్లపై ప్రభుత్వ నిశ్శబ్దం – కార్యాచరణకు దిగిన బీసీవై పార్టీమాట తప్పిన ప్రభుత్వం, మడమ తిప్పని రామచంద్ర యాదవ్పూలే-మండల్ భవన్ వేదికగా చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు ఏర్పాట్లుప్రభుత్వానికి మార్చి 31 డెడ్‌లైన్ ముగింపు – ఇక ప్రత్యక్ష పోరాటమేనన్న బీసీవై పార్టీ బీసీల న్యాయమైన హక్కుల సాధనకై భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. “బీసీ సింహగర్జన” సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం “పూలే-మండల్ భవన్” వేదికగా “బీసీ ధర్మ దీక్ష” పేరుతో ఈ ఆమరణ నిరాహార దీక్ష జరగనుంది. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రామచంద్ర యాదవ్ ఈ కఠోర దీక్షకు పూనుకున్నారని పార్టీ పేర్కొంది.ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాల్సిన ఐదు కీలక డిమాండ్లు1.బీసీ రక్షణ చట్టం: బీసీల సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా “బీసీ రక్షణ చట్టాన్ని” వెంటనే అమలు చేయాలి2.అమరావతిలో భూమి: రాజధాని అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాలు,ఈ కార్యక్రమంలో  బిసివై పార్టీ రాష్ట్ర ఈసి సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్,బీసీ సంఘం రాష్ట్ర నాయకులు శేషఫణి,రాయలసీమ బీసీ హక్కుల పోరాటం నాయకులు కురువ సుంకన్న, పత్తికొండ నియోజకవర్గ బిసివై  పార్టీ ఇన్చార్జి బొబ్బే పక్కీరప్ప,వాల్మీకి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author