13 గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
1 min read

కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి, డిమాండ్.
పత్తికొండ, న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన 13 గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు సిఐటియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం పత్తికొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి స్థానిక నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. సిఐటియు మండల అధ్యక్షులు డి గోపాల్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు నెట్టెక్కంటయ్య, అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి యం.రవిచంద్ర వ్యవసాయ సంఘం నాయకులు సిద్దయ్య గౌడ్ ప్రజానాట్యమండలి నాయకులు కాసిం, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎం రంగన్న, సిపిఐ నాయకులు డి. రాజా సాహెబ్, కారుమంచి, ముఖ్య అతిధులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికులకు కర్సికులకు 13 గంటల పని విధానం అసెంబ్లీలో తీర్మానించడం చీకటి రోజుగా కార్మికులు గుర్తుంచుకుంటారని కార్మికులపై కక్ష సాధింపు చర్య గా 13 గంటల పని విధానం ఉందని తక్షణమే ఈ 13 గంటల పని విధానాన్ని రద్దు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ లోని కూటం ప్రభుత్వం నడుస్తుందని ఇక జనసేన పార్టీ డు డూ బసవన్న పాత్ర పోషిస్తుందని కనీసం కార్మికులపై అమానుషమైన చట్టాన్ని తీసుకువస్తుంటే దాన్ని ప్రశ్నించాల్సిన వైసిపి కూడా నోరు మెదపడం లేదని దీని వెనుక అంతర్వేమిటిని వారు ప్రశ్నించారు. తక్షణమే వైయస్సార్ పార్టీ నాయకులు అసెంబ్లీ తీర్మానాన్ని అడ్డుకోవాలని లేనిపక్షంలో వైసీపీ పార్టీ కూడా కార్మిక వ్యతిరేకిగా నిలబడాల్సి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మద్దికేర మండలం కార్యదర్శి బురుజుల రాముడు ప్రజానాట్.

