విద్యుత్ ఆదా-డిమాండ్ రెస్పాన్స్
1 min read

విద్యుత్ ఖర్చులను తగ్గించడం మరియు స్థిరమైన విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ వర్క్ షాప్ ప్రధాన ఉద్దేశ్యo
ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ పి.సాల్మన్ రాజు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై పరిశ్రమలు మరియు వాణిజ్య వినియోగదారులలో అవగాహన కల్పించుటకు రెండు రోజుల పాటు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ పి.సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టార్టప్ సంస్థ “ఎలిమెంట్స్ ఎనర్జీ” తో భాగస్వామ్యంగా నిర్వహించబడుతోందని,ఎనర్జీ, ఖర్చు ఆదా-డిమాండ్ రెస్పాన్స్ అనే అంశంపై ఈ వర్క్ షాప్ నిర్వహించబడుతుందన్నారు. అధునాతన డిమాండ్ రెస్పాన్స్ విధానాల ద్వారా విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా వినియోగించడం, విద్యుత్ ఖర్చులను తగ్గించడం మరియు స్థిరమైన విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ వర్క్ షాప్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. మొదటి దశ కార్యక్రమం విశాఖపట్నంలో ఈనెల 17న నిర్వహించగా, రెండవ దశ కార్యక్రమం ఈనెల 18న రాజమహేంద్రవరం విద్యుత్ కార్యాలయంలో నిర్వహించబడుతుందిన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి, కాకినాడ,అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లాలకు చెందిన పరిశ్రమలు మరియు వాణిజ్య వినియోగదారులు పాంగొంటున్నారన్నారు. ఈ వర్క్ షాప్ లో పాల్గొనే వారికి విద్యుత్ వినియోగం తగ్గింపు, ఖర్చు నియంత్రణ, డిమాండ్ మేనేజ్‌మెంట్ మరియు విద్యుత్ వ్యవస్థ స్థిరత్వంపై సమగ్ర అవగాహన కల్పించబడుతుందని, కావున, సంబంధిత పరిశ్రమలు మరియు వాణిజ్య వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వర్క్ షాప్ లో పాల్గొని ప్రయోజనం పొందవలసిందిగా సాల్మన్ రాజు కోరారు.

