గంజాయి వ్యాపారుల కటకటాల పాలు..
1 min read

ఒడిస్సా నుంచి గంజాయి సరఫరా
పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: గంజాయి వ్యాపారం చేస్తూ కటకటాల పాలయ్యారు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో.. పట్టణ సీఐ వై ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని అందిన సమాచారం మేరకు నాగరంగం వెంచర్ లో గంజాయి సరఫరా చేస్తున్న మొత్తం ఐదుగురిలో నలుగురుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.అదేవిధంగా వారి వద్ద ఉన్న సుమారు 1100 గ్రాముల గంజాయి,3వేల నగదు,4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ముద్దాయిల వివరాలను పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ముద్దాయిలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు:కావేటి రాజు(45)ఆత్మకూరు, నందికొట్కూర్ పట్టణానికి చెందిన పింజరి మహబూబ్ బాష(22),దూదేకుల ముర్తు జావలి(27),షేక్ సోహెల్ (26), ఆత్మకూరు కావేటి నాగ శేషాద్రి (20)వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు నాగ శేషాద్రి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.ఎస్ఐ చంద్రశేఖర్ మరియు సిబ్బందిని సీఐ అభినందించారు.ఒడిస్సాకు రైలులో వెళ్లి గంజాయి ఇక్కడికి తీసుకువచ్చి వాటిని అమ్ముకొని ముద్దాయిలు జల్సాలు చేసేవారని ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు.


