నాలుగు లేబర్ కోడ్లన వెంటనే రద్దు చేయాలి
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటిసి నాయకులు భాస్కర్ యాదవ్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న, సిఐటియు నాయకులు జయరాజు లు డిమాండ్ చేశారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేశారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. అంబేద్కర్ సర్కిల్ మానవహారం ఏర్పడి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక వర్గం త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికే కార్మికులు చాలీచాలని జీతాలతో పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి లేదని వారు అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ 26,000 ఇవ్వాలని పిఎఫ్ ఎస్ఐ భీమా సౌకర్యాలు కల్పించాలని అలాగే వి బి జి చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులకు ఇబ్బంది కలిగించే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి ప్రాణేష్, టి లక్ష్మన్న, రైతు సంఘం నాయకులు ఎస్ వీరేష్, కెవిపిఎస్ నాయకులు జి అంజి, దేవాపుత్ర, అంగన్వాడి కార్యకర్తలు ప్రమీల సిఐటియు మండల కార్యదర్శి టి భీమేశ్వరి అధ్యక్షులు విశాలాక్షి ఆశా వర్కర్లు సి సలోమి ఈరమ్మ సుజాత పుష్ప తదితరులు పాల్గొన్నారు.

