NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామాల్లో స్థూల నికర ఆదాయం పెంచడమే లక్ష్యం

1 min read

మహానంది, న్యూస్​ నేడు:    గ్రామాల్లో స్థూల నికర ఆదాయం వచ్చే మూడు సంవత్సరాల్లో పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని బొల్లవరం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులకు పలు సూచనలు చేశారు 2025_ 2026_2027_2028 సంవత్సరాల్లో పై విధానాన్ని మూడు సంవత్సరాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐదు సూత్రాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఆహార ప్రాసెసింగ్, గ్రామాల్లో స్థూల నికర ఆదాయం పెంచడం దీంతోపాటు పశు పోషణ తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు. రైతులకు ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో రెండో విడత కూడా నగదు జమ చేయడం జరిగింది అన్నారు. సన్న చిన్న కారు రైతులకు బిందు సేద్యం ద్వారా 90% సబ్సిడీ ద్వారా బిందు సేద్యం పరికరాలు, ఎం ఎస్ పి ,ఎం ఐ ఎస్ ద్వారా రైతు పంటను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ పైన పేర్కొన్న కార్యక్రమాన్ని నిర్వహించారు . బొల్లవరం జరిగిన  కార్యక్రమంలో వీఆర్వో మాధవ్, గ్రామ వ్యవసాయ శాఖ అధికారిని మంజుల, పశుసంవర్ధక శాఖ గ్రామ అధికారిని రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author