సర్వేయర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు
1 min read

వంద శాతం అటెండెన్స్ నమోదు చేయాలి
ప్రజల్లో మంచి పేరు వచ్చేలా పని చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు : సర్వేయర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి హెచ్చరించారు.జిల్లాలో భూ సర్వే విభాగం పనితీరులో మరింత పారదర్శకత, బాధ్యత మరియు ప్రజల నమ్మకం పెంపొందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో సర్వే డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఎఫ్ పి ఓ ఎల్ ఆర్, రీ సర్వే, ఐవిఆర్ఎస్ కాల్స్, సర్వే కు సంబంధించిన అంశాలపై విలేజ్ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సర్వేయర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకటో, రెండో దరఖాస్తులు వస్తే అవి కూడా చేయలేరా అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా టాప్–5 ర్యాంకులో నిలిచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. పబ్లిక్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ సూచికల్లో జిల్లా మంచి స్థానాల్లో నిలవాలంటే ప్రతి ఉద్యోగి నిజాయితీగా, నిబద్ధతతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సర్వే కు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.సమావేశంలో జిల్లా సర్వే అధికారి ముని కన్నన్, ఆర్డీవో సందీప్ కుమార్, సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

