NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

1 min read

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

ది ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు

కార్యదర్శి అడపా సత్యనారాయణ,ఉప్పులూరి హేమ శంకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రపంచ మేధావి,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమం ది ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటోనగర్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తాను చిన్ననాటి నుంచి ఈ సమాజంలో ఎదుర్కొన్న కుల వివక్షతకు, అస్పృశ్యతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. అంబేద్కర్ ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాలలో చదువుకొని ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ ప్రజలందరికీ అమోదయోగ్యమైన అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అసోసియేషన్ కార్యదర్శి అడపా సత్యనారాయణ,అసోసియేషన్ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశ ఔన్నత్యాన్ని,గొప్పదనాన్ని ప్రతిబింబించేలా ప్రపంచం గర్వించదగిన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అని కొనియాడారు. ఆయన నిర్వహించిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని మన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ జుల్ఫీ అసోసియేషన్ సభ్యులు మంతెన వెంకటేశ్వరరావు,పర్వేజ్, షఫీ, కాలేషా, కాశి, బాబురావు, శాయన అభిలాష్ కుమార్, కురెళ్ళ వరప్రసాద్,ఎలక్ట్రిషన్ సాంబ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *