NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్  135వ జయంతిని పురస్కరించుకుని,డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్యాపిలి  పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో అంబేద్కర్  విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, సమానత్వం, న్యాయం మరియు సామాజిక న్యాయ సాధనలో అంబేద్కర్  సేవలు అపారమని కొనియాడారు. దేశ రాజ్యాంగ నిర్మాతగా ఆయన అందించిన మార్గదర్శకత్వం ప్రతి పౌరునికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, ఎంఆర్ఓ భారతి, మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, తెదేపా నాయకులు సీమా సుధాకర్ రెడ్డి, నేరేడుచేర్ల వెంకటేష్, మాజీ ఎంపీటీసీ గొల్ల రామ్మోహన్ యాదవ్,మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, తేదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, తేదేపా ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మదు కుమార్, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, ఎస్ కే వలి, ఆర్ ఇ.నాగరాజు, బోచేర్వు పల్లె క్రిష్ణయ్య, రాజా రవి, కడితం ప్రతాప్ రెడ్డి, బిజెపి నాయకులు కెసి మద్దిలేటి, దామోదర్ నాయుడు, సీనియర్ ముస్లిం మైనారిటీ నాయకులు మత్తు బాబా సాహెబ్, శాంసన్, గుండల చంద్రశేఖర్,ఆర్సీ మద్దిలేటి, బాలరంగన్న, శేఖర్, బాలక్రిష్ణ, తదితరులు కూటమి నాయకులు కార్యకర్తలు,ఎంఆర్సీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *