అమ్మ వృద్ధుల శరణాలయాన్ని తనిఖీ చేసిన న్యాయమూర్తి”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి,ఈ రోజు అనగా 26-02-2026 న మద్దూర్ నగర్ నందు గల పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని మరియు అమ్మ వృద్ధుల శరణాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించి అక్కడి సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించారు.అక్కడి వారిని అడిగి వారికీ అందించే భోజన, వసతి, వైద్య సదుపాయలను గురించి తెలుసు కొని సంతృప్తి వక్తం చేసారు. వృద్ధులకు నిరాశ్రయులకు ఏవైనా సమస్యలుంటే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100కు కాల్ చేస్తే వారి చట్ట పరమైన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయ వాది రాంపుల్లయ్య, వసతి గృహ నిర్వాహకురాలు శకుంతల తదితరులు పాల్గొనారు.

