దిగ్విజయంగా ముగిసిన ప్రజాదర్బార్
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలో దిగ్విజయంగా ముగిసిన ప్రజాదర్బార్! ప్రజా సమస్యలే ప్రాధాన్యతగా – మీ చెంతకు మీ జ్యోతమ్మ ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వైకుంఠంజ్యోతి నివాసంలో జరిగిన ‘గ్రీవెన్స్’ (ప్రజాదర్బార్) కార్యక్రమం విశేష స్పందనతో అత్యంత విజయవంతంగా ముగిసింది.కార్యక్రమ విశేషాలు: నియోజకవర్గంలోని మూలమూలల నుండి వందలాది మంది ప్రజలు విచ్చేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, సాగునీరు మరియు స్థానిక సమస్యలపై వచ్చిన అర్జీలను వైకుంఠం జ్యోతి స్వయంగా స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.“ప్రజల కష్టాలను తీర్చడమే మా లక్ష్యం. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే వరకు మీ వెంటే ఉంటాం వైకుంఠ జ్యోతి తెలిపారు.

