రేపు పల్స్ పోలియో చుక్కలను వేయించండి
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : రేపు 21వ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో దశరథ రామయ్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఆరోగ్య సిబ్బంది పల్స్ పోలియో వేయించుట గురించి శుక్రవారం ర్యాలీ చేపట్టారు. రేపు ఉ 7 గం.ల నుండి సా 5 వరకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని 0-5 సం.ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని అన్నారు. మండలంలో 31 పోలింగ్ కేంద్రాల్లో 3445 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. బస్టాండ్ ప్రాంగణంలో పోలియో చుక్కలపై అధికారులు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు, సిహెచ్ఓ సురేష్ బాబు, హెల్త్ సూపర్వైజర్ ఏసేపు,వీఆర్వో వెంకటయ్య, ఎంపీహెచ్ఏ(ఎఫ్)సుగుణమ్మ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

