జడ్పీహెచ్ బాలికల ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి
1 min read

పత్తికొండ న్యూస్ నేడు: పత్తికొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ కోరారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుల మేరకు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను విద్యార్థుల బృందం సందర్శించింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అనేక సమస్యలు తమ చదువులకు ఇబ్బందులు కలుగుతున్నాయని విద్యార్థులు బృందానికి తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఏఐఎస్ఎఫ్ బృందం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ముగ్గురు పిఈటిలు ఉన్నప్పటికీ క్రీడలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదని ఆవేదన చెందారు.అదేవిధంగా స్కూల్ మొత్తానికి ఓకే హిందీ టీచర్ ఉందని, ఇంతవరకు హిందీ టీచర్ను నియమించలేదని విద్యార్థులు తెలిపారు. అలాగే తాగునీటి కోసం ప్రస్తుతం ఉన్న మినరల్ వాటర్ సరిపోడం లేదని వారన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి బాలికో ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ బృందం విద్యాధికారులను కోరింది. పాఠశాలకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న హిందీ టీచర్ను నియమించాలని, అలాగే పాఠశాల విద్యార్థులకు తాగునీటి సౌకర్యం సరిపడా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల సమకూర్చుకొని ఎంఈఓ, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ మండల మండల కార్యదర్శి శివ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జూనియర్ కళాశాల సెక్రటరీ రంగసామి, అధ్యక్షులు బాబు, కన్వీనర్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.


