పి4లో ఉపాధ్యాయులెవరినీ దత్తత తీసుకోవాలని ఒత్తిడి లేదు
1 min read

జిల్లా విద్యాశాఖధికారిణి ఎం.వెంకట లక్ష్మమ్మ
ఆసక్తి ఉన్నవారు ఎవరైనా స్వచ్ఛందంగా పి4 నమోదు చేసుకోవచ్చు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఉపాధ్యాయులెవరినీ కూడా పీ4లో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఎటువంటి ఒత్తిడి చేయలేదని, జిల్లా విద్యా శాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వారు మండలానికి 190 ప్రధానోపాధ్యాయులు/స్కూల్ అసిస్టెంట్ లను మార్గదర్శకులుగా రిజిస్టర్ చేయమని ఎక్కడా ఆదేశాలు జారీ చేయలేదన్నారు. పీ4 కార్యక్రమంలో మార్గదర్శి గా నమోదు స్వచ్చంద కార్యక్రమమని డీఈఓ స్పష్టం చేస్తూ పీ4 కార్యక్రమంలో మార్గదర్శిగా భాగస్వాములు కావడానికి ఆసక్తి ఉన్న ఎవరైనా స్వచ్చందంగా మాత్రమే తమను తాము నమోదు చేస్తుకోవచ్చని వివరించడమైందని డీఈఓ చెప్పారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులను అప్పగించడం జిల్లా కలెక్టర్ కూడా వ్యతిరేకమన్నారు. పీ4 లో గుర్తించిన బంగారు కుటుంబాలను ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలనిగాని, ఆ మేరకు మార్గదర్శకులుగా రిజిస్టర్ కావాలని గాని జిల్లా విద్యా శాఖ నుండి ఒత్తిళ్లు వస్తున్నాయన్న నిరాధార ఆరోపణలు చేయడం తగదని డీఈ ఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు.

