NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రం పారిశ్రామిక రంగంలో పరుగులు పెడుతుంది

1 min read

ప్రపంచంలో రెండవ అతి పెద్దదైన బెవరేజెస్ ప్లాంటు ఏర్పాటుకు రిలయెన్స్ అధినేతను ఆహ్వానించడం శుభపరిణామం

సూరి మన్సూర్ అలీ ఖాన్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు

కర్నూలు, న్యూస్​ నేడు: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో పరుగులు తీస్తుందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. టీడీపీ కర్నూల్ అసెంబ్లీ కార్యాలయంలో ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం పరిశ్రమలు, పెట్టుబడుల రంగంలో దినదినాభివృద్ధి చెందుతుందని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు టీజీ భరత్  పరిశ్రమల స్థాపన కోసం విశేషంగా కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా ఇటీవల ముంబై లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్  ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బెవరేజెస్ ప్లాంటు ఏర్పాటు కొరకు రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ ముఖేశ్ అంబానీ ని రాష్ట్రానికి ఆహ్వానించడం శుభపరిణామం అని.. ఆయన రాకతో మన ప్రాంతంలో పారిశ్రామిక రంగానికి మరింత బలం చేకూరే అవకాశం ఉందని, పెట్టుబడులు పెరగడానికి మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీజీ భరత్  కృషి వల్ల నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని,  ఇది భవిష్యత్తు తరాలకు ఎంతో శ్రేయస్కరమని తెలిపారు.  టీజీ భరత్  లాంటి కష్టపడే తత్వం ఉన్న వారిని మన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గా నియించడం వల్ల ప్రజలు  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలుపుతున్నారని, అటు రాష్ట్ర పారిశ్రామిక రంగం, ఇటు కర్నూల్ ప్రగతి కి విశేషంగా కృషి చేస్తున్న శ్రీ టీజీ భరత్ కి యువత రుణపడి ఉంటారని పేర్కొన్నారు.

About Author