ఈనెల 28 లోపు పెన్షన్ దారులజీవన పత్రాలు అందజేయాలి
1 min read

న్యూస్ నేడు, పత్తికొండ : పత్తికొండ సబ్ ట్రెజరీ పరదిలో ఉన్న సర్వీస్ ఫ్యామిలీ పెన్షన్ దారులు జీవన ప్రమాణ పత్రాలు ను (లైఫ్ సర్టిఫికెట్) ఇవ్వని వారు ఉంటే ఈ నెల 28 వ తేదీ లోపల వచ్చి జీవన పత్రాలు ఇచ్చి ఆన్ లైన్ మీ పేరును నమోదు చేయించుకోవాలి అని ఉప ఖజానా అధికారి ఉమాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.పత్తికొండ సబ్ ట్రెజరీ పరిధిలో 711 మంది పెన్షనర్లు ఉండగా ఇప్పటి వరకు గురువారం 674 మంది మాత్రమే ఆన్ లైన్ తమ పత్రాలను ఆప్ లొడ్ చేసుకున్నారని, వారి పేర్లను ఆమోదించమన్నారు. మిగిలిన 37 మంది తమ పేర్లను ఆన్ లైన్ లో చేసుకోవాలన్నారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో సమర్పించిన జీవన ప్రమాణ పత్రాలు చెల్లుబాటు కావనే విషయాన్ని గుర్తుచుకోవలన్నారు. ఈ నెల చివరి లోగా లెఫ్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఎప్రిల్ 1వతేది చెల్లించిన మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుందన్నారు. గడువు పొడగించే అవకాశం లేదన్నారు.కావున రాలేని వారు ఎవరైనా ఉంటే వారి ఇంటి దగ్గర వచ్చి మీ నివాసం నందే మా సిబ్బంది నమోదు చేసుకుంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఎవరైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్ 7780392128 కు సంప్రదించాలని ఆమె కోరారు.

