“స్వతంత్ర పోరాటంలో వందేమాతర గీతం ది ప్రత్యేక స్థానం”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కే.యంసి ప్రిన్సిపాల్ డా.కె.చిట్టి నరసమ్మ… స్వతంత్ర పోరాటంలో వందేమాతర గీతం ది ప్రత్యేక స్థానమని ఈ గీతం కొన్ని లక్షల మందిని స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించిందని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కి చిట్టి నరసమ్మ అన్నారు. వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు మెడికల్ కాలేజీ యందు విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ “వందేమాతరం” అంటూ “ఉరి కంభం వైపు నడిచిన మొట్టమొదటి వ్యక్తి” బెంగాల్ సాయుధ పోరాట దళం పోరాటయోధుడు కుదిరామ్ బోస్ అని తెలిపారు. విద్యార్థులకు వందేమాతరం పాట యొక్క చరిత్రను వివరించి వారందరిచే వందేమాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సింధియా శుభప్రద, ఆనాటమీ బయో కెమిస్ట్రీ విభాగాధిపతులు ప్రో. డా. శోభ దేవి, డా కిరణ్మయి, వైద్య ఆధ్యాపకులు డా . కృష్ణమోహన్, డా. సోమశేఖర్, డా. రేఖ డా. గాయత్రి, డా.విజయలక్ష్మి, డా మనోజ్ కుమార్ రెడ్డి, డా. లోకనాథ్, డా .లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

