NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓర్వలేని తనంతో ఒరిగేదేమి లేదు..

1 min read

ప్రజా శ్రేయస్సుకై సమిష్టిగా  పాటుపడతాం- వైకుంఠం శివప్రసాద్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి.

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల నాయకుల సమిష్టి సమావేశం తెలుగుదేశం కార్యకర్తలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నటువంటి ఆలూరు వైసిపి శాసనసభ్యుడు విరుపాక్షి పై మండిపడిన కూటమి నాయకులు హొళగుంద మండలం కేంద్రంలోని వేదావతి నది ద్వారా లభిస్తున్న ఇసుకపై లేనిపోని వదంతులను వ్యాపింపజేస్తూ ప్రజాభివృద్ధి రాష్ట్ర పరిరక్షణ కొరకై శరవేగంగా దూసుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వపు ప్రతిష్టను భంగపరిచే కుట్రలను ఏమాత్రం సహించబోమని హొళగుంద మండల కన్వీనర్ తిప్పయ్య, సింగల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, దేవరగట్టు చైర్మన్ వీరనాగప్ప, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి గోవింద గౌడ్, మైనార్టీ నాయకులు అబ్దుల్ సుభాన్, మురళీధర్, జిల్లా బి.సి కార్యదర్శి ఎల్లార్తి దర్గన్న మాజీ మండల కన్వీనర్ దుర్గయ్య, సీనియర్ వాల్మీకి నాయకులు తోక వెంకటేష్, ఎల్లార్తి మల్లికార్జున, సర్పంచులు సుధాకర్,  శేషప్ప తదితరులు ఏకతాటిగా ప్రతిఘటించారు.ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీమతి వైకుంఠం జ్యోతి  భాధ్యతలు చేపట్టిన అతి స్వల్ప కాలంలోనే అత్యంత ప్రజాదారణ పొండడమే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను ఏకతాటిపై తెచ్చేందుకు చేస్తున్న కృషి మరియు కష్టం అమోఘమైనదని కొనియాడారు. ఏది ఏమైనప్పటికి హొళగుంద మండల కూటమి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఐకమత్యంతోనున్నమాని అతి స్వల్పం కాలంలోనే అందరికి చేరువైన ఆలూరు ఇంచార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి  నాయకత్వం ప్రశంశించదగ్గదని మరియు సంవృద్ధ వంత నాయకత్వాన్ని ఏకం చేసెందుకు పార్టీకొరకు కష్టపడిన అందరికి తగిన ప్రాధాన్యతనిస్తూ అందరిని సంప్రదించి కలుపుకుపోతామని వెల్లడించారు. ఆలూరు నియోజకవర్గంలో కూటమి కోటను బద్దలుకొట్టాలని ప్రజాభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షపు కుట్రలను సమిష్టిగా ఎదుర్కుంటామని కూటమి నాయకుల ఐక్యతను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి నిరూపిస్తామన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిదానంద, మాజీ కన్వీనర్ ప్రసాద్, హొళగుంద మండల కూటమి నాయకులు వైకుంఠం యువసేన గిరి,ఐ-టిడిపి తాలూకా కార్యనిర్వాహక కార్యదర్శి ఖాదర్ బాషా, మాజీ కన్వీనర్ వీరనగౌడ, సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్ ఇవనాయకులు ఆలూరు వలిబాష,తిక్కస్వామి, టిఎన్​ఎస్​ఎఫ్ మండల కార్యదర్శి ఐకల్ మల్లికార్జున, సీనియర్ నాయకులు మిక్కిలినేని శ్రీనివాస్. వేణుగోపాల్ సిబిఎన్ ఆర్మీ ముల్ల మోయిన్, మైనార్టీ నాయకుడు ఆదమ్, కూడ్లుర్ సుభాన్,బూత్ ఇంచార్జి అమాన్, తాహెర్, మార్కెట్ యార్డు డైరెక్టర్ గెజ్జహళ్లి నబిరసూల్, నాయకులు కరూర్ హుస్సేన్ పీరా,మేదేహాల్ హుస్సేన్ పీరా, సులేమాన్, ,మరియు ఇంద్రసేనా రెడ్డి, హెబ్బటం మల్లికార్జున, గోపాల్, ఉపసర్పంచ్ సవారప్పలతో పాటు హొళగుంద మండలంలోని అన్ని గ్రామాల టిడిపి మరియు జనసేన బిజెపి కూటమి నాయకులు మరియు పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author