NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు:  దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో   భాగంగా) ఈరోజు శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామి భజనబృందం, యమ్మిగనూరు, కర్నూలు జిల్లా వారిచే  భజన కార్యక్రమం  నిర్వహించబడుతోంది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి  ఈ  భజన   కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.         ఈ కార్యక్రమములో శివ శివ శంకరా,  ఈశ్వరా పరమేశ్వరా, శివ శివ అనవే, శ్రీశైలభ్రమరాంబికా, నమో పార్వతీ పరమేశ్వరా, నమశ్శివాయ,  శ్రీశైలం శివమయం  మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను మొదలైనవాటిని  జమ్మన్నస్వామి, శీనప్ప,  యల్లప్ప, శ్రీశైలంస్వామి,  కృష్ణమూర్తి తదితరులు  ఆలాపించనున్నారు. ఈ కార్యక్రమానికి  తాళం సహకారాన్ని మహాలింగప్ప, రఘు, తబల సహకారాన్ని మద్దిలేటి, రిథమ్ ప్యాడ్ సహకారాన్ని తులసీ అందించనున్నారు.        కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

About Author