రామాపురం క్షేత్రం లో ఉత్తర ద్వారా దర్శనం భక్తులు..
1 min read

న్యూస్ నేడు కమలాపురం : భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం కమలాపురం మండలంలోని రామాపురం పుణ్యక్షేత్రంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వార మోక్ష నారాయణి దర్శనం చేసుకున్నారు.శ్రీ వల్లి దేవసేన సమేత ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువైన శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో గురువారం ఉత్తర ద్వారం నుంచి దేవదేవులు దర్శనం ఇచ్చారు .ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతన విగ్రహ మూర్తులైన శ్రీ మోక్ష నారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా మూర్తుల కు ప్రతిరోజు నిత్య కల్యాణాలు జరిగే ఈ ఆలయంలో ప్రతినెల శుక్లపక్ష ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరుస్తుంటారు అన్ని ఆలయాలలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉత్తర ద్వారం తెరుస్తారు కానీ ఈ ఆలయంలో సంవత్సరానికి 12 సార్లు ఉత్తర ద్వారం తెరవడం ఒక విశిష్ట ప్రత్యేకత .శ్రీ మహావిష్ణువు మోక్ష అవతారంలో ఈ భువిలో ఎక్కడా లేనివిధంగా మోక్షమార్గం చూపుతూ వెలిసి ఉండడం ఈ ఆలయంలోని మూలవిరాట్ లోని ప్రత్యేకత .గత 15 సంవత్సరాలుగా ఆలయ పునః ప్రతిష్ట అనంతరం ప్రతినిత్యం హరిహర దేవత మూర్తులైన మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామికి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కీ ఒకే వేదికపైన కళ్యాణ్ నిర్వహిస్తుంటారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఆలయంలో అభిషేకాలు అర్చనలు, ప్రత్యేక అలంకరణ భక్తులుకు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద ఆలయం మారుమోగింది. వేంపల్లి ఆర్యవైశ్య మహిళలు విష్ణు పారాయణం నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్తర ద్వార దర్శనం ద్వారా సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం జరిగింది.

