NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి…

1 min read

కర్నూలు జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

  • మంత్రి టిజి భరత్​

 కర్నూలు,  న్యూస్​ నేడు: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్ జిల్లా ప్రజలకు  ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  తెలుగు నూతన  సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర  ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి రాష్ట్ర మరియు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు..  ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, అన్ని వర్గాల ప్రజలూ  ఆనందంగా ఉండాలన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని  మంత్రి ఆకాంక్షించారు.

About Author