NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా ప్రభుత్వం తోనే.. అభివృద్ధి సాధ్యం

1 min read

వాణిజ్య, పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి భరత్

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రజా ప్రభుత్వం… సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర  వాణిజ్య, పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి భరత్ పేర్కొన్నారు. బుదవారం కర్నూలు మండలం జోహారపురం గ్రామంలోని 19 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉన్న డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంయుక్తంగా ప్రారంభించారు. ఆధునిక యంత్రాలను వినియోగిస్తూ శుభ్రత పనులను వేగవంతంగా చేపట్టడం జరిగిందని తెలిపారు.  ఈ సందర్భంగా మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ… గతంలో జోహారపురం గ్రామాన్ని “జహారాపురం డంపింగ్ యార్డ్”గా పిలిచే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను ఇప్పటికే 50 నుండి 60 శాతం వరకు తొలగించామని తెలిపారు. జోహారపురంలో ఉన్న  19 ఎకరాల భూమి అత్యంత విలువైనదిగా ఉండి, ఎకరానికి సుమారు రూ.50 కోట్ల విలువ ఉందని, మొత్తం భూమి విలువ దాదాపు రూ.1000 కోట్లకు చేరుకుంటుందని మంత్రి తెలిపారు. ఇంత విలువైన భూమి చాలా కాలంగా చెత్తతో నిండిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ సమస్యను పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి చెత్త తొలగింపునకు రూ.5 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం డంపింగ్ యార్డులో ఉన్న లక్ష మెట్రిక్ టన్నుల చెత్తను రెండు నెలల వ్యవధిలో పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపారు. చెత్త తొలగింపు అనంతరం ఈ భూమిని మున్సిపల్ కార్పొరేషన్ అవసరాలకు అనుగుణంగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడారు.  

About Author