జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
1 min read

ప్రమాద నివారణకు సమగ్ర చర్యలు–మాక్ డ్రిల్లులు, భద్రతా మాన్యువల్ తప్పనిసరి
ఫ్యాక్టరీలు భద్రతా ప్రమాణాలు పర్యవేక్షణ వ్యవస్థ, నోడల్ ఏజెన్సీస్లు ఏర్పాటు చెయ్యాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయీ పారిశ్రామిక భద్రతా కమిటీ మరియు క్రైసిస్ గ్రూపులు కమిటీ సమావేశాన్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, సేఫ్టీ అధికారులతో కలసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో ఏ కేటగిరి 04, బి 1 కేటగిరి 26, బి2 కేటగిరి 06 మొత్తం 36 పరిశ్రమలు మీద భద్రత ప్రమాణాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఫ్యాక్టరీకి తప్పనిసరిగా భద్రతా అధికారిని నియమించి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను అమలు చేసి రొటీన్ గా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలన్నారు. భద్రతా వృత్తాలు, జోన్లు ఏర్పాటు చెయ్యాలని, ప్రజలు కూడా ప్రమాదాలు జరిగే సమయంలో అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. వార్షిక భద్రతా శిక్షణ క్యాలెండరు, భద్రతా మాన్యువల్, భద్రతా బుక్‌లెట్ ద్వారా కార్మికులకు అవగాహన కల్పించడం, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం జరగాలన్నారు. ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ సజావుగా పనిచేయడం, సెన్సర్ యాక్టివేషన్ ద్వారా జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం వంటి అంశాలను పగడ్బందీగా అమలు చెయ్యాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్రం జియం పి.సుబ్రహ్మణ్యేశ్వర రావు, జిల్లా పరిశ్రమలు తనిఖీ అధికారి కె. కృష్ణమూర్తి, ఐటిడిఏ పివో కె. రాములు నాయక్, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ఇఇ కె.వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్.జితేంద్రబాబు, జిల్లా మత్స్యశాఖ డిడి బి.నర్సయ్య, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి. శేఖరు, వివిధ శాఖల అధికారులు, వివిధ పరిశ్రమలు సేఫ్టీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


