‘వి’ డ్యాన్స్ స్టూడియో.. అదుర్స్
1 min read

స్టూడియోను ప్రారంభించిన కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డి, అని మాస్టర్, డా. సుచరితా రెడ్డి,
కర్నూలు, న్యూస్ నేడు:సమాజంలో యువతకు డ్యాన్స్ అత్యంత కీలకంగా మారిందన్నారు కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డి. ఆదివారం నగరంలోని వెంకటరమణ కాలనీ 5వ లైన్ మెయిన్ రోడ్డులో ‘ వి’ డ్యాన్స్ స్టూడియోను కేశవ రెడ్డి తోపాటు అని మాస్టర్, డా. సుచరితా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అని మాస్టర్ మాట్లాడుతూ పిల్లలు, యువత సెల్ ఫోన్ , టీవీలకు పరిమితం కాకుండా నృత్యం నేర్చుకోవాలని సూచించారు. నృత్యం వల్ల శారీరక ఎదుగుదలతోపాటు మేధా శక్తి పెంపొందుతుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం ‘ వి’ డ్యాన్స్ స్టూడియో అధినేత జె. వినయ్ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు నృత్యం నేర్పుతామని, అందుకు తనతోపాటు డ్యాన్స్ మాస్టర్లు కొందరు ఉన్నారని చెప్పారు. ‘ వి’ డ్యాన్స్ స్టూడియో లో క్లాసికల్, వెస్ట్రన్, ఫోక్ డాన్స్, ఏరోబిక్స్, సల్సా, సంగీత్, వంటి డ్యాన్సులు నేర్పిస్తామన్నారు. అంతేకాకుండా స్కూల్ ఈవెంట్స్, కాలేజీ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ కు అందుబాటులో ఉంటామన్నారు. ఈ అవకాశాన్ని నగర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

