విజయదశమి కానుక ఆడపిల్లల లక్కీ డ్రా లో విజేతలకు 50, వేలు అందజేత
1 min read

చెన్నూరు, న్యూస్ నేడు: మండల కేంద్రమైన చెన్నూరు పడమట వీధిలో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సంఘ సేవ కార్యకర్త. గుగ్గిళ్ళ చాణిక్య. “అమ్మాయి భవిష్యత్తు, నిధి కింద బాలికలు సురక్షితంగా ఉంటే సమాజం సురక్షితంగా ఉంటుంది. అనే నినాదంతో ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా ఆడపిల్లలకు లక్కీ డ్రా లో 50 వేల రూపాయలు. విజయదశమి పురస్కరించుకొని 9-8-2024 నుండి 8-8-2025 సంవత్సరం మధ్య పుట్టిన ఆడపిల్లలకు లక్కీ డ్రా ద్వారా శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి కమిటీ నిర్వాహకులచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం పాప యొక్క డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆధార్ కార్డు. ఫోన్ నెంబర్. అడ్రస్ పూర్తి వివరాలతో ఆలయ కమిటీకి మండలంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు నమోదు చేసుకోవడం జరిగింది. అనుకున్న విధంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో కమిటీ ద్వారా లక్కీ డ్రా నిర్వహించగా ఈ లక్కీ డ్రా లో ఉప్పరపల్లె ఎస్సీ కాలనీకి చెందిన బాలిక ఆద్యశ్రీ తల్లిదండ్రులైన తిప్పని శశి, గోవర్ధన్లకు సంఘ సేవకర్త గుగ్గిళ్ల చాణక్య గెలుపొందిన ఆడబిడ్డకు 50 వేల రూపాయలు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి దేవస్థానం ద్వారా సీఐఎం కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లి శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

