NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో సుఖీ సురక్ష కార్యక్రమం

1 min read

ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళుతున్నారు

అనర్ధక ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని హితవు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఆ లక్ష్యానికి సుస్థిరమైన బాటలు వేస్తున్నారని, అందులో భాగంగానే సఖి సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు అగ్రహారంలోని మర్చంట్స్‌ ఛాంబర్‌ కళ్యాణ మండపంలో బుధవారం మెప్మా ఆధ్వర్యంలో సఖి సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు 35 సంవత్సరాలు పైబడిన స్వయం సహాయ సంఘాల సభ్యులైన మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించిన తీరును స్వయంగా పరిశీలించిన వారు,,, అక్కడున్న మెప్మా అధికారులకు, సిబ్బందికి, వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. అందుకే సఖి సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని స్పష్టం చేశారు. స్వయం సహాయ సంఘాల మహిళల ఆరోగ్యం – కుటుంబ శ్రేయస్సుతో కూడిన ఈ సఖి శ్రేయస్సు కార్యక్రమాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒత్తిళ్ళకు దూరంగా ఉండడం ఉత్తమని సూచించిన ఆయన అనర్ధకారక ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఈ సందర్భంగా హితవు పలికారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసీ చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్‌ పప్పు ఉమామహేశ్వరరావు, ఏలూరు నగర తెలుగుదేశం అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు,ఏలూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ. భానుప్రతాప్‌, ఎమ్మార్వో గాయత్రి ,కో – ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్‌ పెదబాబు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సురేందర్‌, మెప్మా పిడి మాధవి లత, డిస్ట్రిక్ట్‌ మిషన్‌ కో- ఆర్డినేటర్‌ మహాలక్ష్మి, ఏలూరు టౌన్‌ కో-ఆర్డినేటర్‌ ఝాన్సీ మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకురాలు పాల్గొన్నారు.

About Author