NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఖబర్దార్..నోరు జారితే సహించేది లేదు

1 min read

-పట్టణ వైసీపీ ఎస్సీసెల్ ఫైర్..

నందికొట్కూరు న్యూస్ నేడు: ఖబర్దార్ వైసీపీ నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ పైన గాని మా కార్యకర్తల పైన గాని అనవసరంగా నోరు జారీ మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని నందికొట్కూరు వైసీపీ ఎస్సీ సెల్ తాలూకా అధ్యక్షులు మార్కెట్ రాజు మరియు పట్టణ ఎస్సీ సెల్ కార్యదర్శి చరణ్ తేజ తెలుగుదేశం పార్టీ నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సుధీర్  నియోజకవర్గంలో పేద ప్రజలకు అండగా నిలుస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారని రాజకీయ కక్షతో అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు హెచ్చరించారు.సుధీర్  నాయకత్వంలో వైసీపీ మరింత బలంగా ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న దారా సుధీర్ పై కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థలం విషయంలో స్వయంగా బాధితులే నిరసనకు దిగారు. డాక్టర్ సుధీర్ వ్యాపార కోసం కాదు ప్రజా సేవ కోసం ఆయన పరితపిస్తున్నాడని వారు అన్నారు.మరోసారి మా పార్టీ నాయకులపై లేనిపోని మాటలు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసన్న, కిషోర్,అయ్యన్న,ఎలీషా, సురేష్,సుదీర్,రవి,ప్రభుదాస్ పాల్గొన్నారు.

About Author