NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంచికి మారుపేరు చౌటుకూరు సర్పంచ్

1 min read

వరుసగా రెండుసార్లు గ్రామానికి సేవలు

మధార్ సాహెబ్ కు ఘన వీడ్కోలు..

మిడుతూరు న్యూస్ నేడు: ఒకసారి కాదు రెండుసార్లు వరుసగా గ్రామ సర్పంచ్ గా ఎన్నికైగ్రామానికి సేవలందించారు అంతేకాదు ఆయనంటే మంచికి మారుపేరు ఎవరు పిలిచినా పలికే వ్యక్తి గ్రామ అభివృద్దే ధ్యేయంగా గ్రామ ప్రజలకు ఎలాంటి చిన్న సమస్య తలెత్తకుండా గ్రామాన్ని అభివృద్ధి బాటలో పట్టించిన వ్యక్తి చౌటుకూరు సర్పంచ్ డి మదర్ సాహెబ్ అని చెప్పవచ్చు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో గత ఐదేళ్లుగా సర్పంచ్ గా పనిచేశారు. గ్రామంలో ఆరు త్రాగునీటి బోర్లు ఉండగా ఎలాంటి చిన్న నీటి సమస్య కూడా రాకుండా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసేవారు.బోర్లు మరమ్మతులు అయిన వెంటనే రిపేర్లు చేయించే వారు.సర్పంచ్ పదవీకాలం ఈనెల 2వ తేదీతో ముగిసింది.2021 లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 350 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటిసారిగా సర్పంచ్ గా పోటీ చేసిన 2017 లో 250 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.ఈ ప్రస్తుత సర్పంచ్ పదవిలో గ్రామంలో డ్రైనేజీ మరియు సిమెంట్ రోడ్లు వేయించానని సర్పంచ్ గా సేవలు అందించడం సంతోషంగా ఉందని సర్పంచ్ మదార్ సాహెబ్ అన్నారు. పంచాయతీ కార్యదర్శి వినయ్ చంద్ర,గ్రామస్తులు బాలిరెడ్డి,జయరామిరెడ్డి, రంగారెడ్డి కమాలుద్దీన్ దూద్ పీరా మరియు సచివాలయ సిబ్బంది సర్పంచ్ కు శాలువా పూలమాలలతో ఘనంగా వీడ్కోలు పలికారు.సర్పంచ్ సేవలను వారు కొనియాడారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *