NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బచ్చు జానకి రామ్​ ఫౌండేషన్​ సేవలు అభినందనీయం

1 min read

రాజ్య సభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్​

  • 250 మంది మున్సిపల్​ వర్కర్లకు ఉచిత వైద్య పరీక్షలు

 కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు :కర్నూలు జిల్లా ప్రజలకు వివిధ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి… ఎందరో మనన్నలు పొందిన బచ్చు జానకి రామ్​ ఫౌండేషన్​ సేవలు అభినందనీయమని రాజ్య సభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్​ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని మున్సిపల్​ కౌన్సిల్​ హాల్​ లో  ప్రముఖ నెఫ్రాలజి వైద్యులు డా. సాయి వాణి,  ప్రముఖ క్యాన్సర్​ వైద్య నిపుణుడు డా. రవీంద్ర బాబు నేతృత్వంలో  250 మందికి ఉచిత మూత్ర పిండ వ్యాధులకు సంబందించి హెచ్​బివి, ఆర్​బీ ఎస్​ మరియు బీపి,  బరువు, ఎత్తు  తదితర పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్​ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా  బచ్చు జానకిరామ్ ఫౌండేషన్ మరియు కిడ్నీ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.  సేవ చేయాలనే తలంపుతో  ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు డా. రవీంద్ర బాబు మున్సిపల్​ వర్కర్లకు ఉచిత వైద్య శిబిరం, రెండు నెలల కిందట వర్కర్ల పిల్లలకు  క్యాన్సర్​ వ్యాక్సినేషన్​ వేయడంతోపాటు వైద్య శిబిరం నిర్వహించారని పేర్కొన్నారు.  అనంతరం  నిర్వాహకులు డాక్టర్ సాయి వాణి మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యలతో కిడ్నీ వ్యాధికి గురి కాకుండా ఉంటారని, కిడ్నీబాధితులు ఎవరైనా చివరి దశ వరకు తెచ్చుకోవద్దని సూచించారు. డయాలసిస్​ బాధితులకు 250 లీటర్ల నీళ్లు అవసరమని, కొందరు ప్రతి వారం రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు.  శరీరంలో మూత్ర పిండాలు దెబ్బతింటే  ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.  ఆ తరువాత బచ్చు ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు డా. రవీంద్ర బాబు మాట్లాడుతూ మున్సిపల్​ వర్కర్లు ఆరోగ్యం పై దృష్టి సారించాలని సూచించారు.

About Author