NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

20 లక్షల ఉద్యోగాలు కల్పించే చర్యలు చేపడుతున్నాం

1 min read

జిల్లా లో ఏర్పాటు అవుతున్న కంపెనీల కు తగ్గట్టు యువత శిక్షణ పొంది ఉండాలి

పరిశ్రమలు , వాణిజ్యం  మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  టి.జి.భరత్

కర్నూలు ,  న్యూస్​ నేడు  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఎన్నికల సమయం లో ఇచ్చిన వాగ్దానం మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే చర్యలు తీసుకుంటూ ఉన్నామని పరిశ్రమలు , వాణిజ్యం  మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  టి.జి. భరత్ కెవిఆర్ కళాశాల జాబ్ మేళాలో పేర్కొన్నారు.సోమవారం ఉదయం కర్నూలు కెవిఆర్ కళాశాల లో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన జాబ్ మేళాను మంత్రి టి.జి. భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలలో కల్పించే ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నామని తెలిపారు.కర్నూలు సెయింట్ జోసెఫ్ కళాశాలలో  గతం లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో 950 మంది పైగా ఉద్యోగాలు సాధించారని ఇప్పుడు 1550 ఉద్యోగాలను 21 సంస్థల ద్వారా కల్పించే చర్యలు చేపడుతున్నామని ఈ 1550 ఉద్యోగాలను మీరు సాధించాలని యువతకు  తెలిపారు. మీకు ఇపుడు వస్తున్న అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకొని ఉద్యోగంలో చేరి మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలని మంత్రి సూచించారు. ఈ జాబ్ వేళా సమావేశానికి జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి , స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజకుమార్ , కెవిఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండయ్య , బొందెల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, స్పార్క్స్ ఇంచార్జ్ గిరిజరాణి  పాల్గొన్నారు.

About Author